కాలా బిజినెస్ ఈ రేంజ్ లోనే..?

Update: 2018-06-05 13:10 GMT

'కబాలి' తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'కాలా'. జూన్ 7న వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది. రజిని ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కబాలినీ దాటేసింది...

'కబాలి' సినిమా ప్లాప్ అయిన ఈ సినిమాకు భారీ రేట్స్ పలికాయి. 'కబాలి'తో పోలిస్తే చాలా ప్రాంతాల్లో 'కాలా' థియేట్రికల్ రైట్స్ తక్కువ రేటుకే పలికాయి. అయితే శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం 'కబాలి'ని అధికమించి దాని పై స్థానంలో నిలిచింది 'కాలా'. 'కబాలి' 218 కోట్ల బిజినెస్ చేయగా .. 'కాలా' బిజినెస్ 230 కోట్ల మార్క్ ను అందుకుంది.

ఓవర్సీస్ లోనూ మంచి బిజినెస్...

అటు ఓవర్సీస్ లో అమెరికా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో రజినికి మంచి ఫాలోయింగ్ ఉన్నందున అక్కడ 'కబాలి' కంటే 10 కోట్లు అదనంగా రాబట్టింది. శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమా 70 కోట్లు రావడంతో ఓవర్ అల్ గా ఈ చిత్రాన్ని 230 కోట్లు బిజినెస్ చేసింది.

Similar News