కాలాకు....మూడురోజుల్లోనే అంత వచ్చిందా...?

Update: 2018-06-11 07:03 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలంటే ఫాన్స్ లో పిచ్చ క్రేజ్ కానీ.. ప్రస్తుతం రజినీకాంత్ స్టామినా బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోయింది. రజినీకాంత్ 'కాలా' చిత్రం గత గురువారమే విడుదలై బాక్సాఫీసు వద్ద పెద్ద మ్యాజిక్ చెయ్యలేక తెగ ఇబ్బంది పడుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే 'కాలా' కి కష్టాలు వచ్చిపడ్డాయి. యావరేజ్ టాక్ తో 'కాలా' కలెక్షన్స్ ఢీలా పడిపోయాయి. కానీ తమిళనాట మాత్రం 'కాలా' కొచ్చిన యావరేజ్ టాక్ టోన్ తోనే రజినీకాంత్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో చెన్నై లో అన్ని రికార్డులను తిరగేసిన 'కాలా'.. తమిళనాట సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుందట.

తమిళనాడులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రం గా వున్న 'కాలా' కలెక్షన్స్ తమిళనాట మాత్రం అదరగొడుతున్నాయంటున్నారు. తమిళనాట 'కాలా' సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్రాస్ తెచ్చుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు కూడా. ధనుష్ నిర్మాతగా రంజిత్ పా డైరెక్షన్ లో తెరకెక్కిన 'కాలా' సినిమాని తమిళ ప్రజలు బాగా ఆదరించారు. అందుకే అక్కడ హిట్ అయ్యింది. అయితే 'కాలా' సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రోస్ తెచ్చినట్లుగా ప్రముఖ మూవీ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఆయన తన ట్విట్టర్ లో... బ్రేకింగ్: 'కాలా' ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ తెచ్చినట్లుగా ట్వీట్ చేసాడు.

నిజంగానే వంద కోట్లు వచ్చిందా..?

మరి తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ కి 'కబాలి' తో క్రేజ్ తగ్గిపోయిందని 'కాలా' కలెక్షన్స్ చెబుతుంటే తమిళనాట మాత్రం ఎన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యింది కాదన్నయ్యా.. ఇక్కడ విషయం.. ఆయన కొత్త చిత్రానికి ఎంత బజ్ ఉంది... ఎంత క్రేజ్ వచ్చిందనేది ఇక్కడ లెక్క అన్నట్టుగా కలెక్షన్స్ ఉన్నాయి. మరి రజనీకాంత్ కి 'కబాలి' ఫ్లాప్ వదిలిపోయి తమిళంలో 'కాలా' విజయదుందుభి మోగించిందన్నమాట. కాకపోతే కొందరు మాత్రం నిజంగానే 'కాలా' 100 కోట్లు తెచ్చిందా అనే ఆశ్చర్యంలో ఉన్నారు... అది వేరే విషయం.

Similar News