#RRR కి అదే కీలకం కానుందా?

ఏడు వరాల బ్రేక్ తర్వాత #RRR టీం మళ్ళీ షూటింగ్ చిత్రీకరణలో బిజీ అయ్యింది. రాజమౌళి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్ [more]

Update: 2019-06-05 16:45 GMT

ఏడు వరాల బ్రేక్ తర్వాత #RRR టీం మళ్ళీ షూటింగ్ చిత్రీకరణలో బిజీ అయ్యింది. రాజమౌళి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తున్నాడు. సెకండ్ షెడ్యూల్ మధ్యలో చేతికి గాయమైన ఎన్టీఆర్ ఇప్పుడు గాయం మానిన తర్వాత #RRR షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గత రెండు రోజులుగా రాజమౌళి కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ పై #RRR లో కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ లోని ప్రత్యేకమైన సెట్ లో కొమరం భీంకు బ్రిటిష్ సైనికులకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలును చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అయితే ఈ బ్రిటిష్ యుద్ధ సన్నివేశాలు #RRR సినిమా మొత్తంలోనే హైలెట్ గా నిలుస్తాయట. సినిమాలో ఈ కీలక సన్నివేశాలు బ్రిటిష్ సైనికులు భారతీయుల పై చేసే దాడులకి ప్రతీకారంగా ఎన్టీఆర్ వారిని అంతం చేసే క్రమంలో వస్తాయని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ గాయం మాని షూటింగ్ లో పాల్గొంటుంటే… రామ్ చరణ్ భార్య ఉపాసనతో విదేశీ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో రామ్ చరణ్ కూడా #RRR షూటింగ్ లో జాయిన్ అవుతాడట

Tags:    

Similar News