#RRR 500 కోట్లు బిజినెస్ ఖాయం

Update: 2018-11-19 02:52 GMT

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం #RRR షూటింగ్ ఈరోజు నుండి హైదరాబాద్ పరిసరాల్లో స్టార్ట్ కానుంది. తారక్ - చరణ్ హీరోలుగా వస్తున్నా ఈసినిమా కోసం ఇద్దరు గత కొన్ని రోజులు నుండి ఫైటింగ్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రాజమౌళి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ట్రేనింగ్ నిన్నటితో ముగిసింది. ఇక ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

జక్కన్న 'బాహుబలి' తరువాత చేస్తున్న చిత్రం కావడం..ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈసినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ సమాచారం ప్రకారం అన్ని బాషల హక్కులు కలుపుకుని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని టాక్.

అలానే శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. టోటల్ గా ఈసినిమా 500 కోట్లు బిజినెస్ ఖాయం అని చెబుతున్నారు ట్రేడ్ వారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

Similar News