అందుకే తారక్ అంటే ఇష్టమంటాడు

రాజమౌళి కి ఇష్టమైన హీరోల్లో తారక్ (ఎన్టీఆర్) ముందు వరసలో ఉంటాడు. తారక్ ఎనేర్జి లెవెల్స్ రాజమౌళికి చాలా ఇష్టం. ఇక తారక్ కూడా జక్కన్న జక్కన్న [more]

Update: 2019-11-06 09:08 GMT

రాజమౌళి కి ఇష్టమైన హీరోల్లో తారక్ (ఎన్టీఆర్) ముందు వరసలో ఉంటాడు. తారక్ ఎనేర్జి లెవెల్స్ రాజమౌళికి చాలా ఇష్టం. ఇక తారక్ కూడా జక్కన్న జక్కన్న అంటూ రాజమౌళి ని ప్రేమతో సంబోధిస్తుంటాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ రాజమౌళితో #RRR సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం #RRR సినిమా షూటింగ్ జెట్ స్పీడులో సాగుతుంది. మొన్నామధ్యన షూటింగ్ కి బ్రేకిచ్చినా.. ప్రస్తుతం ఎటువంటి బ్రేకులు లేకుండా షూటింగ్ సాఫీగా సాగుతుంది. తాజాగా ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ సీన్ ని షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ సీన్ కోసం భారీగానే ఖర్చుపెట్టారట.

అయితే ఖర్చుకి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ సూపర్ గా వచ్చిందని, అసలు అంత ఎక్సట్రార్డినరీగా రావడంతో రాజమౌళి కూడా షాకయ్యాడట. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ అన్నిటికీ ఎన్టీఆర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడని, రాజమౌళి ఊహించినదానికన్నా ఆ సీన్ బాగా రావడంతో రాజమౌళి సైతం హ్యాపీ అయ్యాడని చెబుతున్నారు. ఇక #RRR లో గూస్ బంప్స్ తెప్పించే సీన్ కూడా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీనే అని చెబుతున్నారు. ఇక జక్కన్న హ్యాపీ అవడంతో ఎన్టీఆర్ కూడా హ్యాపీ అంటున్నారు. రాజమౌళి ఇచ్చే డైలాగ్స్ కూడా బలంగా ఉండడం, ఎన్టీఆర్ కూడా టాలెంటెడ్ నటుడు కావడంతో ఇలాంటి న్యూస్ లు బయటికి వస్తుంటాయి. అవి చూసిన హీరో ఫాన్స్ కూడా సంతోషపడుతుంటారు.

Tags:    

Similar News