#RRR పై అదిరిపోయే న్యూస్

Update: 2018-11-11 02:50 GMT
Ram Charan Junior NTR Rajamouli #RRR

ఎన్నిరోజులుగానో ఎదురు చూస్తున్న ఆ శుభతరుణం రానే వచ్చింది. కొద్దిసేపట్లోనే మెగా, నందమూరి అభిమానుల కోలాహలం మొదలవుతుంది. మరికొన్ని గంటల్లోనే #RRR మూవీ లాంచ్ జరగబోతుంది. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని రాజమౌళి డివివి దానయ్య నిర్మాతగా మొదలు పెట్టడానికి సన్నాహాలు పూర్తి చేసాడు. చాలా సైలెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ ని హైదరాబాద్ శివారులోని అల్ల్యుమినియం ఫ్యాక్టరీ వేదికగా ఈ ప్రారంభోత్సవాన్ని జరపబోతున్నాడు. ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో పాటుగా ముఖ్య అతిధులుగా ఈ వేడుకకి రాజమౌళి తో పనిచేసిన హీరోలంతా గెస్ట్ లుగా హాజరవబోతున్నారనే న్యూస్ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు నిద్రలేకుండా చేసింది. రాజమౌళి తో ఎన్టీఆర్ మూడు చిత్రాల్లోనూ, రామ్ చరణ్ ఒక చిత్రంలోనూ నటించారు. ఇక రాజమౌళితో నితిన్, సునీల్, నాని, ప్రభాస్, రానా, రవితేజ లు పనిచేశారు.

మరి #RRR మూవీ ఓపెనింగ్ కి ఈ హీరోలంతా హాజరవుతారని న్యూస్ సోషల్ మెడిలో చక్కర్లు కొడుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ గా వేసిన సెట్ లో #RRR ఓపెనింగ్ జరగబోతుంది. ఇక ఈ ఓపెనింగ్ కి మీడియా ప్రతినిధులకు ఆహ్వానం అందలేదంటే.... ఈ కార్యక్రమానికి మీడియా ని దూరంపెట్టినట్టే. ఇక రాజమౌళి సినిమాకి అతిదులెవరు అక్కర్లేదు. కానీ తనతో పనిచేసిన హీరోలతో కలిసి కొత్త మూవీ మొదలుపెట్టడం కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి సినిమా ఓపెనింగ్ లో ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ దగ్గరనుండి టెక్నీకల్ గా పనిచేసే వారిని రాజమౌళి పరిచయం చేస్తాడో లేదో కాస్త సస్పెన్స్. మరి ఆ విషయము మరికొద్ది సేపట్లోనే తేలిపోతుంది. #RRR మూవీ ఓపెనింగ్ కోసమే మీరెంతగా ఎదురు చూస్తున్నారో కానీ.. నేను మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా.. మరి మీరు చూసెయ్యండి

Similar News