ఎన్టీఆర్ పవర్ ఫుల్ గానే

Update: 2018-07-30 02:45 GMT

బాహుబలి విడుదలైపోయి అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. మళ్ళీ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంతవరకు సెట్స్ మీదకెళ్ళలేదు. ఆయన ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడతాడా అని దేశమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే బాహుబలి సినిమాతో జపాన్, చైనా, ఇలా వరల్డ్ వైడ్ గా తన సినిమా తో అందరిలోనూ ఇంట్రెస్ట్ పుట్టించిన రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అందరూ ఎదురు చూసేలా చేసింది. అయితే ఆర్నెల్ల క్రితమే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇద్దరు స్టార్ హీరోలతో ఉంటుందని ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను రివీల్ చేసాడు రాజమౌళి. ఇదిగో అప్పటినుండి ఆ RRR సినిమా మీద మరింత క్యూరియాసిటి జనాల్లో పెరిగిపోయింది. ఇక మెగా - నందమూరి అభిమానులు అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని కాచుకుని కూర్చున్నారు. మరి తన ప్రకటనతో అందరికి పూనకాలు తెప్పించిన రాజమౌళి ఎన్టీఆర్ అండ్ చరణ్ లను ఎలా చూపిస్తాడో అనే దానిమీద రోజుకో న్యూస్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

తాజాగా రాజమౌళి మల్టీస్టారర్ ఆంగ్లేయ నేపథ్యంలోని కథ గా ఉంటుందని అంటున్నారు. ఇంతకు ముందు రాజమౌళి కథ మీద రకరకాల న్యూస్ లు వినబడినప్పటికీ తాజాగా వినబడుతున్న కథే.. అంటే బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో భారత స్వాతంత్ర్య పోరాటం బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుందనేది నిజమంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా లో చెయ్యబోయే పాత్ర గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయ్యింది. ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ పోషించబోయే పాత్ర... ఫుల్లీ పవర్ ఫుల్ అని... తిరుగుబాటు నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని.. అది కూడా ఒక అల్లూరి సీతారామ రాజు, సుభాష్ చంద్ర బోస్ లాంటి విప్లవ నాయకుల లాంటి పాత్రగా ఎన్టీఆర్ పాత్రని రాజమౌళి డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు.

అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ సినిమాలను సిడి వేసుకుని మరీ వీక్షిస్తున్నాడని.. ఆ పాత్రల్లోని పవర్ ని సినిమాలు చూస్తు తెలుసుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక ఎన్టీఆర్ రోల్ ఇదైతే.. చరణ్ కి ఎలాంటి రోల్ ఇవ్వబోతున్నాడో అంటూ అప్పుడే ఆయన అభిమానులు ఇదైపోతున్నారు. ఇక రాజమౌళి ఈ మల్టిస్టారర్ పూర్తి స్క్రిప్ట్ తో పాటుగా ఈ సినిమా కోసం అలియా భట్, శ్రద్ద కపూర్, కీర్తి సురేష్ పేర్లను హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారీ మల్టీస్టారర్ ని డివివి దానయ్య 400 కోట్లతో నిర్మిస్తుండగా.. ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకెళ్లే సూచనలు ఉన్నాయి

Similar News