#RRR కోసమే తప్పుకున్నాడా?

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో #RRR లో నటిస్తున్నాడు. చరణ్ తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. భారీ మల్టీస్టారర్ గా [more]

Update: 2019-03-19 04:57 GMT

అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో #RRR లో నటిస్తున్నాడు. చరణ్ తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ #RRR సినిమా వచ్చే ఏడాది జులై నెలాఖరున విడుదల అంటూ విడుదల తేదీ లాక్ చేసాడు రాజమౌళి. అంటే ఇక షూటింగ్ నిర్విరామంగా సాగితేనే సినిమా అప్పటికి విడుదల సాధ్యమవుతుంది. అందుకే ఎన్టీఆర్ #RRR షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా పాల్గొనడానికి.. తనకొచ్చిన భారీ ఆఫర్ ని తిరస్కరించాడంటున్నాడు. ఎన్టీఆర్ క్రేజ్ తో బిగ్ బాస్ అనే రియాల్టీ షో ని స్టార్ మా రెండేళ్ల క్రితం మొదలెట్టిన సంగతి తెలిసిందే. అరవింద సమేత షూటింగ్ బిజీతో సీజన్ 2 ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్… మూడో సీజన్ కోసం వస్తున్నాడని అన్నారు.

ఇక మరికొద్ది నెలల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 కి ఎన్టీఆర్ హోస్ట్ అంటూ స్టార్ మా కూడా ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్ కూడా నిన్నటివరకు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేసేందుకు సుముఖంగానే ఉన్నాడు. తాజాగా షూటింగ్ షెడ్యూల్స్ వలన బిగ్ బాస్ చేయలేనని ఎన్టీఆర్ స్టార్ మా యాజమాన్యానికి తేల్చి చెప్పాడనేది టాక్. ప్రస్తుత హైదరాబాద్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న #RRR టీం ఈ నెల్లోనే పూణె, అహ్మదాబాద్ కి తదుపరి షెడ్యూల్ కోసం వెళ్లనుంది. దాదాపుగా 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ ఉంటుందట. ఇక ఆ తర్వాత మళ్లీ నార్త్ ఇండియాలోని కొన్ని ఇతర ప్లేసెస్‌లో కూడా #RRR షూటింగ్ చిత్రీకరించాలని.. అందుకే ఎన్టీఆర్ ఎపుడు హైదరాబాద్‌లో ఉంటాడో.. ఎప్పుడు ఉండడో తెలియదు కాబట్టి…. జూన్ నెల నుండి మొదలు కాబోయే జరిగే బిగ్ బాస్ షోని హోస్ట్ చేసేందుకు కుదరదని ఎన్టీఆర్ డిసైడ్ అవడంతో… బిగ్ బాస్ నిర్వాహకులకు ఆ విషయమే చెప్పి తప్పుకున్నాడట.

ఇక ఎన్టీఆర్ తప్పుకోవడంతో.. మళ్ళీ అంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో కోసం స్టార్ మా యాజమాన్యం సెర్చిం స్టార్ట్ చేసిందని.. అందులో రానా, విజయ్ దేవరకొండ బెస్ట్ ఆప్షన్ గా కనబడుతున్నారని… చివరికి బిగ్ బాస్ సీజన్ 3 కి ఫైనలా గా ఎవరుహోస్ట్ చేస్తారో అనే క్యూరియాసిటిలో బుల్లితెర ప్రేక్షకులు ఉన్నారు.

Tags:    

Similar News