గాయం ఇంకా మానినట్లు లేదే..!

స్టార్ హీరోల గాయాల కారణంగా రాజమౌళి తన #RRR సినిమా షూటింగ్ ని చాలారోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. #RRR షూటింగ్ లోనే హీరోలు [more]

Update: 2019-05-28 08:13 GMT

స్టార్ హీరోల గాయాల కారణంగా రాజమౌళి తన #RRR సినిమా షూటింగ్ ని చాలారోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. #RRR షూటింగ్ లోనే హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కి గాయాలవడంతో రాజమౌళి #RRR షూటింగ్ కి బ్రేకిచ్చాడు. రామ్ చరణ్ కాలికి గాయం, ఎన్టీఆర్ కి చేతి గాయం అయ్యాయి. అయితే సెకండ్ షెడ్యూల్ గాయాలతో వాయిదా పడగా… తాజాగా #RRR షూటింగ్ మొదలవబోతున్నట్లుగా అందులో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి రామ్ చరణ్ గాయం వివరాలు తెలియదు కానీ ఎన్టీఆర్ చేతి గాయం మాత్రం ఇంకా తగ్గినట్లుగా అనిపించడం లేదు.

గాయం మానకముందే షూటింగ్..?

మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ ఫాన్స్ కి చెయ్యి ఊపుతున్నప్పుడు ఎన్టీఆర్ గాయం స్పష్టంగా కెమెరాకి చిక్కింది. ఇక తాజాగా ఎన్టీఆర్ గాయం ఇంకా మానలేదనడానికి ప్రూఫ్ గా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన ఎన్టీఆర్ చేతి గాయం మనలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ చేతికి ఇంకా కట్టు ఉండడం చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ చేతి గాయం మనలేదనిపిస్తుంది. మరి ఈ గాయం మానకుండా #RRR షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటే గాయం మరింత జఠిలమయ్యే ప్రమాదముంది. రాజమౌళి హడావిడిగా గాయాలు తగ్గకుండా షూటింగ్ మొదలెడితే మొదటికే మోసమొచ్చే ప్రమాదముంది. మరి కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ఫైనల్ అవలేదు.

Tags:    

Similar News