తార‌క్ స‌డ‌న్ గా ఎందుకు వెళ్లిపోయాడు..?

అందరు డైరెక్టర్స్ లా కాదు రాజమౌళి. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కచ్చితంగా హిట్ కొడతాడు. అందుకే ఇప్పటివరకు రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. రాజమౌళి సినిమా [more]

Update: 2019-02-12 08:24 GMT

అందరు డైరెక్టర్స్ లా కాదు రాజమౌళి. ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కచ్చితంగా హిట్ కొడతాడు. అందుకే ఇప్పటివరకు రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. రాజమౌళి సినిమా అంటేనే అందరికి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లాంటిది. అతని సినిమా ఎలా ఉంటుంది? అసలు ఏ జోనర్? ఇతర నటీనటులు ఎవరు? అన్న ప్రశ్నలు మొదలు అవుతాయి. ఈ నేపథ్యంలో #RRR నుండి కూడా అదే క్యూరియాసిటీ ఉంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు హీరోల పేర్లు తప్ప ఎవరి పేర్లు బయటికి రానివ్వలేదు. ముఖ్యంగా హీరోయిన్స్, విలన్ ఎవరు అనేది మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నాడు. ఇటువంటివి మెయింటైన్ చేస్తే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుందని ఆయన భావన.

దుబాయ్ ఎందుకు వెళ్లాడు..?

రాజమౌళి ప్రస్తుతం #RRR షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా తారక్ షూటింగ్ బ్రేక్ నేపథ్యంలో ఫ్యామిలీతో దుబాయ్ వెళుతున్న వార్త బయటకు వచ్చింది. అందుకు సంబంధించి ఫొటోస్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. షూటింగ్ కు సడన్ గా బ్రేక్ ఎందుకు ఇచ్చారు? అసలు తారక్ దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే తారక్ దుబాయ్ వెళ్తుంది ‘ఆర్ఆర్ఆర్’ కోసమని చెబుతున్నారు. తన ఫిజిక్ మేకోవర్ కోసం కానీ.. ఏదైనా కొత్త తరహా విద్యను నేర్చుకోవటం కోసం కానీ కావొచ్చంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

Tags:    

Similar News