ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు..?

నిన్న నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే స్టేజి మీద కనిపించారు. కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి [more]

Update: 2019-02-26 07:36 GMT

నిన్న నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే స్టేజి మీద కనిపించారు. కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య, ఎన్టీఆర్ స్పీచ్ లు హైలైట్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య తన స్పీచ్ 118 సినిమాను 189 అని పలకడం, ఎన్టీఆర్ మహానాయకుడు గురించి ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య, కళ్యాణ్ రామ్ మహానాయకుడు గురించి ప్రమోషన్స్ లో మాట్లాడేశారు కాబట్టి నిన్న స్టేజి మీద మాట్లాడకపోయినా పెద్ద విషయం కాదు. కానీ ఎన్టీఆర్ ఇంతవరకు మహానాయకుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కనీసం ట్వీట్ చేయని ఎన్టీఆర్….

మహేష్ బాబు కథానాయకుడు చిత్రం గురించి ట్వీట్‌ చేసాడు కానీ తారక్ మాత్రం ఆ చిత్రం గురించి ఎలాంటి ట్వీట్‌ చేయలేదు. ఫంక్షన్స్ కి మాత్రమే కలుసుకునే వీరి బాడీ లాంగ్వేజీ చూస్తేనే అర్ధం అవుతుంది వీరు బయట ఎలా ఉంటారో అని. ఎన్టీఆర్ గురించి బాలయ్య కూడా ఒకే ఒకసారి అతని పేరు తలచారు అంతే. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత హీరోపైన ఉంటుంది. కానీ బాలయ్య ఇంతవరకు దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. మొత్తం మీద నందమూరి హీరోస్ అందరికీ ఈ సినిమా తల నొప్పిగా మారింది.

Tags:    

Similar News