తారక్ తర్వాత సినిమా ఆ డైరెక్టర్ తోనే..!

ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో #RRR అనే సినిమా చేస్తున్నాడు. చేతికి గాయం అయ్యి షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ #RRR తరువాత ఎవరి డైరెక్షన్ [more]

Update: 2019-05-21 10:28 GMT

ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో #RRR అనే సినిమా చేస్తున్నాడు. చేతికి గాయం అయ్యి షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ #RRR తరువాత ఎవరి డైరెక్షన్ లో చేయాలో ఫిక్స్ అయ్యిపోయాడట. సాధారణంగా రాజమౌళితో వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించరు మన హీరోస్. కానీ తారక్ మాత్రం నెక్స్ట్ ఎవరితో అని ఫిక్స్ అయ్యిపోయాడు. ఎప్పటినుండో కొరటాల – తారక్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అది రాజమౌళి సినిమా తరువాత ఉంటుందని భావించారు అంతా. కానీ తారక్ మాత్రం మరోసారి త్రివిక్రమ్ కు ఓటేశాడు. అవును తారక్ నెక్ట్స్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు స్వయంగా ప్రకటించడం విశేషం.

ఫ్యాన్స్ కి చెప్పిన తారక్…

నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ తో పిచ్చాపాటీ మాట్లాడిన తారక్.. మాటల మధ్యలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అనుకున్న స్థాయిలో ఆడకపోయినా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. తారక్ కు త్రివిక్రమ్ టేకింగ్ తో పాటు స్టోరీ సెలక్షన్ నచ్చడంతో అరవింద సమేత షూటింగ్ టైంలోనే మరో సినిమా చేద్దామని ఇద్దరూ అనుకున్నట్టున్నారు. మరి స్టోరీ ఏమన్నా ఉందా? లేదా త్రివ్రిక్రమ్ తారక్ కోసం కొత్తగా ఏమన్నా అనుకోవాలా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు అప్పుడే కంఫర్మ్ అని చెప్పలేం. ఎందుకంటే తారక్ ప్రస్తుతం #RRR లో ఉన్నాడు. అలానే త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేస్తున్నాడు. ఈలోపు ఏదైనా జరగొచ్చు.

Tags:    

Similar News