బుల్లి టైగర్ ఫొటోస్ భలే క్యూట్ ఉన్నాయే!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకిష్టమైన రాజమౌళి దర్శకత్వంలో RRR లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. నిన్నమొన్నటివరకు RRR షూటింగ్ సెకండ్ [more]

Update: 2019-06-14 08:29 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకిష్టమైన రాజమౌళి దర్శకత్వంలో RRR లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. నిన్నమొన్నటివరకు RRR షూటింగ్ సెకండ్ షెడ్యూల్ టైం లో ఎన్టీఆర్ చేతికి గాయమవడంతో రెస్ట్ తీసుకుంటూ కుటుంబ సభ్యులతో హాయిగా గడిపిన ఎన్టీఆర్ ఇప్పుడు RRR షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, ఆయనకి ఇద్దరు కుమారులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. గత ఏడాది ఇదే రోజున లక్ష్మి ప్రణతి భార్గవ్ రామ్ కి జన్మనిచ్చింది. తన రెండో కుమారుడికి ఏడాది పూర్తయిన సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొడుకుల క్యూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన బుల్లి టైగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఆ ఫొటోస్ తో పాటుగా భార్గవ్‌ తొలి పుట్టినరోజు అంటూ క్యాప్షన్ పెట్టిన ఎన్టీఆర్.. తన ముద్దుల కొడుకులతో ఎంతో ఆనందంగా కనబడుతున్నాడు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అలా పిక్స్ పోస్ట్ చేసాడో లేదో ఇలా ఆ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ తో పాటుగా యంగ్ టైగర్ అభిమానులు, ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు బుల్లి భార్గవ్ రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News