ఎన్టీఆర్ ఇన్వాల్వ్ మెంట్ ఏం లేదట....!

Update: 2018-05-26 08:38 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వకుండా ఈ సినిమాలో చాలానే జాగ్రత్తలు తీసుకుని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యం లేదా..?

లేటెస్ట్ ఈ టైటిల్ పై ఫిలింనగర్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాకు 'అరవింద సమేత' అనే టైటిల్ మాత్రమే పెడదాం అనుకున్నాడు. కానీ టైటిల్ కింద తన పాత్ర పేరైన 'వీరరాఘవ' ఉంచమని ఎన్టీఆర్ పట్టుబట్టాడనేది ఆ వార్త సారాంశం. ఆలా చేయకపోతే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనుకునే అవకాశం ఉందని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి చెప్పడంతో 'అరవింద సమేత వీర రాఘవ' అని పెట్టారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త హల్ చల్ అవుతుంది. అయితే టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యమే చేసుకోలేదనేది త్రివిక్రమ్ సన్నిహితుల మాట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బ కూడా హీరోయిన్ గా నటించనుంది.

Similar News