నా ముద్దు అతనికే: జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ బాలీవుడ్ లో ‘ధడక్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చేతిలో రెండుమూడు పెద్ద సినిమాలు [more]

Update: 2019-04-25 06:40 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ బాలీవుడ్ లో ‘ధడక్’ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చేతిలో రెండుమూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్. ఇందులో జాన్వీ పైలెట్ గా కనిపించనుంది. అందుకు సంబంధించి శిక్షణ కూడా పొందుతోంది. అలానే కరణ్ నిర్మిస్తున్న 'తక్త్' అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఇందులో కరీనా కపూర్, ఆలియా భట్, అనీల్ కపూర్, విక్కీ కౌశల్, రణవీర్, భూమి సింగ్ వంటి స్టార్లు నటిస్తున్నారు.

విక్కీ కౌశల్ అయితే ఓకే

ఇది పక్కన పెడితే మీరు ఒకవేళ ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు? అని అడిగిన ప్రశ్నకు ఏమి తడబాటు లేకుండా చెప్పింది జాన్వీ. బాలీవుడ్ లో ఓ టీవీ రియాలిటీ షో 'బీఎఫ్ ఎఫ్ విత్ వోగ్' కార్యక్రమంలో హోస్ట్ నేహా ధూపియా జాన్వీకి ఈ ప్రశ్న వేశారు. వెంటనే ‘యూరి’ కథానాయకుడు విక్కీ కౌశల్ కి ఓకే చెప్పేసింది జాన్వీ. విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోస్. ఆ మధ్య ఎప్పుడో టాలీవుడ్ లో ఎవరితో డేట్ కి వెళ్తారు అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. ఇక ఈ షోకి జాన్వీతో పాటు తన సోదరి ఖుషీ కపూర్ పాల్గొంది.

Tags:    

Similar News