అమ్మలో సగం కూడా అనిపించలేదు..!

Update: 2018-07-21 07:42 GMT

టాలీవుడ్ లో నాలుగు సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో నిన్న శుక్రవారం భారీ అంచనాల నడుమ బాలీవుడ్ అతిరథ మహారథుల ఆశీస్సులతో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ వెండితెర తెరంగేత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కూతురిని వెండితెర మహారాణిగా చూడాలని శ్రీదేవి కలలుకన్నారు. కానీ ఆ కల తీరకముందే శ్రీదేవి కన్నుమూయడంతో.. ఆమె అర్జున్ కపూర్ హెల్ప్ తో తన తెరంగేత్ర మూవీని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చెయ్యడమే కాదు. తన ఫస్ట్ హీరో ఇషాన్ ఖట్టర్ తో కలిసి భారీ ప్రమోషన్స్ తో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు శశాంక్ ఖైతాన్ మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయినా సైరాత్ సినిమాని జాన్వీ హీరోయిన్ గా బాలీవుడ్ లో ధఢక్ పేరుతొ రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా తో జాన్వీ కపూర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనే మాట బాలీవుడ్ ధఢక్ రివ్యూస్ చూస్తుంటే అర్ధమవుతుంది.

కొత్త హీరోహీరోయిన్లు కావడంతో...

మరి తల్లి అందాన్ని పునికిపుచ్చుకుని పుట్టిన జాన్వీ కపూర్ మాత్రం తల్లి నటనను ఒంట బట్టించుకోలేకపోయింది. అయితే మొదటి సినిమాకే మనం అలా అనడం భావ్యం కాదు కానీ... ఇక ధఢక్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా ఒరిజినల్ సైరత్ లో గ్రామీణ నేపథ్యంలో ఒరిజినాలిటీ బేస్ మీద సినిమా చేసి హిట్ కొట్టాడు దర్శకుడు నాగరాజ్. కానీ ఇక్కడ హిందీ ధఢక్ లో మాత్రం ఆ ఒరిజినాలిటీనే మిస్ అయ్యింది. మితిమీరి ఖర్చు పెట్టె నిర్మాత చేతిలో ఉన్నప్పటికీ... దర్శకుడు ఆచి తూచి సినిమా చేశాడా అనిపిస్తుంది. ఒక రొటీన్ ప్రేమ కథని తీసుకుని అందులో కొత్తవారిని పెడితే ఎలా ఉంటుందో.. సేమ్ అలానే ధఢక్ సినిమా ఆధ్యంతం కనబడుతుంది. అటు హీరో ఇషాన్ కొత్త వాడు, ఇటు జాన్వీ కపూర్ కొత్త అమ్మాయి. ఇద్దరు కొత్తవారే కావడంతో.. తమ తమ పాత్రలకు ఇద్దరూ న్యాయం చేయలేకపోయారు. అలాగే దర్శకుడు శశాంక్ వారి నుండి నటనను కావాల్సినట్టుగా రాబట్టలేకపోయాడు. ఇక జాన్వీ కపూర్ నటనలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని చోట్ల లుక్స్ పరంగా బాగుంది అనుకున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల జాన్వీ తేలిపోయింది.

కొన్నిచోట్ల మెప్పించినా..

కొన్ని చోట్ల మెరుగైన హావభావాలతో జాన్వీ మెప్పించింది. ఇక కేవలం ఈ సినిమా ఫ్లాప్ కి కారణం హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు... ఈ సినిమా దర్శకత్వం విషయంలోనూ ఫెయిల్ అయ్యింది. ఇక సినిమాటోగ్రఫీ, నిర్మాత కరణ్ జోహార్ పెట్టిన ఖర్చు కోసమే సినిమాకి వెళ్లాలి అంటే అంత టికెట్ పెట్టుకుని థియేటర్ కి వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఇక శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ కి అమ్మ అంతటి స్టార్ డం తెచ్చుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇక శ్రీదేవి లేని లోటు జాన్వీ కపూర్ భర్తీ చెయ్యాలి అంటే... శ్రీదేవి అభిమానులకు ఎన్ని ఏళ్లు పడుతుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

 

Similar News