జాన్వి కపూర్‌.. ఏంటి ఇలా చేశావ్..?

Update: 2018-06-12 06:59 GMT

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. లేటెస్ట్ ఆమె నటించిన 'ధడక్‌' మూవీకి సంబంధించి ఓ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ముందు నుండే కెమెరా ముందు జాన్వి కపూర్‌ ఎలా కనిపిస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో అందులో ఆమె శ్రీదేవికి ఏమాత్రం సరితూగదని కామెంట్లు ఎదుర్కొంటోంది. బయట అందాలు ప్రదర్శిస్తూ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసే జాన్వి కపూర్‌ సినిమాలో డీ గ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌ చేయడంతో తన బలహీనతలు కవర్‌ చేసుకునే వీలు చిక్కలేదు. ఇంతకాలం జాన్వి ఆలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పుకున్నవారంతా. ఇప్పుడు కనీసం పెదవి కూడా విప్పట్లేదు.

నిరాశపర్చిన జాన్వి...

జాన్వి కపూర్‌ ని గ్లామర్ పాత్రలో ఇంట్రడ్యూస్ చేయకుండా ఇలా డీ గ్లామర్ పాత్రలో ఇంట్రడ్యూస్ చేసి శ్రీదేవి తప్పు చేసిందా? అనే కామెంట్స్ వస్తున్నాయి.ఈ సినిమా 'సైరత్' అనే మరాఠి సినిమాకు రీమేక్ గా రూపుదిద్దుకుంటుంది. దానితో కంపేర్ చేసుకుంటే ఇది అంత గొప్పగా ఏమి లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి జాన్వి.. అటు తన గ్లామర్ తో.. ఇటు ట్రైలర్ తో అందరినీ నిరాశపరిచింది.

Similar News