ఈ ప్రచారం నిజమేనంటారా..!

Update: 2018-08-07 06:39 GMT

శ్రీదేవి - బోని కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ నుండి వెండితెరకు ధఢక్ సినిమా తో పరిచయం అయ్యింది. క్యూట్ అండ్ నార్మల్ లుక్స్ తో జాన్వీ కపూర్ ధఢక్ సినిమాలో ఆకట్టుకుంది. అలాగే శ్రీదేవికి ఉన్న క్రేజ్ ఆమె మొదటి సినిమాకి బాగా పనిచేసింది. మరి శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్ గా రారాణిగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కావడంతో.. ఆమె కూతురికి శ్రీదేవి స్టార్ డం వచ్చేసినట్లే అనిపిస్తుంది. బాలీవుడ్ లో ధఢక్ సినిమా తర్వాత జాన్వికి సౌత్ నుండి ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ అయితే బలంగానే వినబడుతుంది. ఇక్కడ టాలీవుడ్ లో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళిల చూపు జాన్వీ కపూర్ మీద పడిందనే ప్రచారం ఓ రేంజ్ లో సాగింది.

శింబు సరసన దక్షిణాదికి ఎంట్రీ

అదేమో గానీ ఇప్పుడు జాన్వీ కపూర్ ఒక సౌత్ హీరో అంటే కోలీవుడ్ హీరోతో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టబోతుందని అంటున్నారు. అది కూడా కోలీవుడ్ లో మన్మధగా పేరు తెచ్చుకున్న శింబు సరసన జాన్వీ కపూర్ కోసం బోని కపూర్ తో చర్చలు జరుగుతున్నట్టుగా కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. హీరో శింబు తన తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ ని తీసుకుని ఆమెకున్న క్రేజ్ ని వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడని.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాన్వీని హీరోయిన్ గా సెట్ చేసుకునేందుకు శింబు తన ప్రయత్నాలు స్టార్ట్ చేసాడట.

మరి జాన్వీ ఒప్పుకుంటుందా..?

మరి ఇంతకుముందు రాజమౌళి, దిల్ రాజుల మీద వచ్చిన వార్తల లాగానే శింబు న్యూస్ కూడా ఫేక్ న్యూసో లేదంటే నిజమో కానీ, ఈ సౌత్ ఆఫర్స్ ని జాన్వీ ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు సౌత్ ప్రేక్షకుల ముందున్న పెద్ద డౌట్. ఇకపోతే జాన్వీ - ఇషాన్ కట్టర్ లు నటించిన ధఢక్ సినిమా 100 కోట్ల క్లబ్బుని చేరుకొని.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

Similar News