పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక

Update: 2018-07-23 08:32 GMT

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు లో కోనేరు కల్పన, డి.అభిరాం, అజయ్ కుమార్ కలిసి కల్పన చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి తెలుగు టీజర్ ను సమ్మోహనం చిత్రం తో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేసారు. జ్యోతిక పర్ఫార్మెన్స్, జీవీ ప్ర‌కాష్ అద్భుతమైన నటన మరియు ఇళయరాజా సంగీతం తమిళంలో ఈ చిత్రం స‌క్సెస్ కి ప్ర‌ధార‌ణ కార‌ణం.

ఇప్పటి పోటీపోటీ...

ఇంత భారీ స‌క్సెస్ ని అందుకున్న‌ నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మ‌రిన్ని సంచ‌లనాలు తెర‌లేప‌టానికి వ‌స్తుంది. తెలుగులోకి వ‌స్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వ‌ర్గాల నుండి పోటాపోటీ బిసినెస్ జరుగుతుంది. త్వరలోనే విడుదల అవుతుంది.

Similar News