జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస సక్సెస్ [more]

Update: 2019-04-17 06:09 GMT

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నానికి ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు కాస్త ఝలక్ ఇచ్చినా… ప్రస్తుతం జెర్సీ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. జెర్సీ సినిమా క్రికెట్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కింది. జెర్సీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాలతోనే నాని జెర్సీ వరల్డ్ వైడ్ గా మంచి థియేట్రికల్ బిజినెస్ చేసింది.

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ (కోట్లు)

నైజాం, అర్బన్ ఏరియాస్ 10 .00
సీడెడ్ 3.20
ఈస్ట్ గోదావరి 1.60
కృష్ణ 1.45
గుంటూరు 1.80
వెస్ట్ గోదావరి 1.25
నెల్లూరు 0.80
ఏపీ, టీఎస్ షేర్స్ 20.10
ఇతర ప్రాంతాలు 1.90
ఓవర్సీస్ 4.00
వరల్డ్ వైడ్ షేర్స్ 26.00

Tags:    

Similar News