‘జెర్సీ’కే ఎందుకులా అవుతోంది..?

బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసిన సినిమా ‘జెర్సీ’. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రశంసల [more]

Update: 2019-04-25 09:39 GMT

బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని క్రిటిక్స్ సైతం మెచ్చుకునేలా చేసిన సినిమా ‘జెర్సీ’. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ వర్క్ అవుట్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ లెక్క ప్రకారం ఈ మూవీ వసూళ్లతో హోరేత్తిపోవాలి. కానీ అలా జరగడం లేదు. అమెరికాలో ప్రీమియర్స్ ప్రకారం ఈ మూవీ 1 మిలియన్ మార్క్ అయితే చేరుకుంది కాని అది కూడా చాలా కష్టంగా అని తెలుస్తుంది. గ్రౌండ్ రియాలిటీలో ఈ మూవీ వీకెండ్ లోనే రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ని ఇంకో రెండు రోజులు ఆలస్యంగా అందుకుంది. అందుకే వసూళ్లు తెగిపోయాయి.

సినిమా బాగున్నా.. కలెక్షన్లు మాత్రం…

మరోవైపు వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అవుతుంది. అక్కడ ఈ సినిమా కోసం జెర్సీని తీసేసి అవెంజర్స్ ఎండ్ గేమ్ కోసం మొహమాటం లేకుండా బయ్యర్లు స్క్రీన్లను ఇచ్చేస్తున్నారు. సరే అక్కడ ఇటువంటివి కామన్ అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. సినిమాకి మంచి టాక్ వచ్చింది కాదా, కలెక్షన్స్ కూడా భీభత్సంగా వస్తాయి అనుకుంటే మామూలు కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఏ సెంటర్స్ ఓకే కాని బీ, సీ కేంద్రాల్లో కొన్ని చోట్ల ‘కాంచన 3’ డామినేషన్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం దీనిపై ‘జెర్సీ’ నిర్మాతలు కంగారు పడుతున్నట్టు వినికిడి. వీకెండ్ లో పికప్ అవుతుంది అనుకుంటే ‘అవెంజర్స్’ బ్రేక్ వేసేలా కనిపిస్తుంది. కాబట్టి ‘జెర్సీ’పై ఫుల్ క్లారిటీ రావాలంటే మరో వారం ఆగాల్సిందే.

Tags:    

Similar News