ఆ హీరో కోసం జెర్సీ హీరోయన్..?

కన్నడలో యూటర్న్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ద శ్రీనాధ్.. తమిళంలోనూ సత్తా చాటింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది [more]

Update: 2019-04-23 07:00 GMT

కన్నడలో యూటర్న్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ద శ్రీనాధ్.. తమిళంలోనూ సత్తా చాటింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్. నానికి జంటగా జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ద శ్రీనాధ్ నటనకు టాలీవుడ్ అంతా ఫిదా అయ్యింది. సారా పాత్రలో శ్రద్ద పలికించిన హావభావాలు, నానితో నటనలో పోటీ పాడడం కూడా శ్రద్దకు మంచి పేరు తీసుకొచ్చింది. శ్రద్ద లుక్స్ లో కాస్త ట్రెడిషనల్ గా ఉన్నప్పటికీ.. హాట్ యాంగిల్స్ లోనూ మెప్పించగలదు. అందుకే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోల చూపు శ్రద్ద శ్రీనాధ్ మీద పడిందనే టాక్ వినబడుతుంది.

నాగచైతన్యకు జోడీగా…

ఇప్పటికే ఒక టాలీవుడ్ నిర్మాత శ్రద్ద కోసం ట్రై చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా దిల్ రాజు జెర్సీ సినిమా చూసాక శ్రద్దని తన తదుపరి మూవీలో లాక్ చేసే పనిలో ఉన్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించబోయే నాగ చైతన్య మూవీలో చైతుకి జోడిగా జెర్సీ హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ అయితే బాగుంటుందని.. దిల్ రాజు ఈ క్యూట్ హీరోయిన్ ని అప్రోచ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. శశి కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ నాగ చైతన్య హీరోగా త్వరలోనే మొదలు కాబోతుంది.

Tags:    

Similar News