జెర్సీ సూపర్ హిట్ అయినా..!

హీరో నాని లేటెస్ట్ సెన్సేషన్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతుంది. మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం [more]

Update: 2019-04-30 07:31 GMT

హీరో నాని లేటెస్ట్ సెన్సేషన్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబడుతుంది. మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ 10 రోజుల్లో 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో ‘భలే భలే మగాడివోయ్’ 1.43 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఉంది. అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ వసూళ్లని క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ అంతే…

ఎందుకంటె అక్కడ హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. అక్కడ ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే. చాలా స్క్రీన్స్ లో ‘జెర్సీ’ సినిమా తీసేసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ వేశారంటే ‘జెర్సీ’ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంది. సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది అనుకుంటే కేవలం ఏ సెంటర్లలో మాత్రమే మంచి రన్ ను కనబరుస్తుంది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా వసూళ్ల విషయంలో డల్ అవ్వడం ఆశ్చర్యమే.

Tags:    

Similar News