జెర్సీ ఆ క్రికెటర్ లైఫ్ స్టోరీనా..?

న్యాచురల్ స్టార్ నానికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. నిన్నుకోరి తరువాత నాని చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు నిరాశపరచడంతో [more]

Update: 2019-03-08 08:34 GMT

న్యాచురల్ స్టార్ నానికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుంది. నిన్నుకోరి తరువాత నాని చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు నిరాశపరచడంతో మళ్లీ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇప్పుడు తన రూట్ మార్చి జెర్సీ అనే కొత్త జోనర్ సినిమాతో మన ముందుకి వస్తున్నాడు. క్రికెటర్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి థీమ్ సాంగ్ లిరికల్ వెర్షన్ విడుదలైంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ రాసిన స్ఫూర్తిదాయకమైన లిరిక్స్‌ ని కాలభైరవ ఫుల్ జోష్‌తో పాడాడు. ఈ సాంగ్ రిపీట్ మోడ్ అయ్యే అవకాశముంది.

రెండు క్లైమాక్స్ లు…

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇది మాజీ ఇండియన్ క్రికెటర్ రామన్ లాంబా లైఫ్ స్టోరీ నేపథ్యంలో సాగే కథ అని చెబుతున్నారు. ఈ మూవీ కోసం రెండు రకాల క్లయిమాక్స్‌ లు ప్లాన్ చేశారట. ఒరిజినల్ గా రామన్ లాంబా క్రికెట్ ఆడుతుండగానే.. బంతి తలకు తగిలి గ్రౌండ్‌లోనే ప్రాణాలు వదులుతాడు. అయితే ఇటువంటి స్యాడ్ ఎండింగ్ తో ఎందుకులే అని హ్యాపీ మూడ్‌తో కూడిన మరో క్లయిమాక్స్ ను కూడా రాసుకుని షూట్ చేసాడట. అయితే ఈ రెండిటిలో ఏదీ ఫైనల్ చేయాలో అర్ధం కాక మేకర్స్ తల పీకున్నట్టు సమాచారం. త్వరలోనే ఏదోకటి ఫైనల్ చేయనున్నారు.

Tags:    

Similar News