అయ్యో జెర్సీని ఇరికించారే..!

ఈ నెలలో మజిలీ సూపర్ హిట్ తర్వాత చిత్రలహరి హిట్ అయ్యింది. ఇక ఆ రెండు సినిమాల తర్వాత నాని జెర్సీ సినిమాని ఏప్రిల్ మూడో వారంలో [more]

Update: 2019-04-24 07:30 GMT

ఈ నెలలో మజిలీ సూపర్ హిట్ తర్వాత చిత్రలహరి హిట్ అయ్యింది. ఇక ఆ రెండు సినిమాల తర్వాత నాని జెర్సీ సినిమాని ఏప్రిల్ మూడో వారంలో వదిలాడు. నాని అనుకున్న దానికన్నా జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అయితే నాని గనుక జెర్సీ సినిమాని సోలోగా దించినట్టు అయితే జెర్సీ బ్లాక్ బస్టర్ టాక్ మాత్రమే కాదు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా వచ్చేవి. కానీ జెర్సీ సినిమాకి ముందు నుండి చెబుతున్నట్టుగానే లారెన్స్ కాంచన 3 దెబ్బకొట్టింది. కాంచన 3కి నెగెటివ్ టాక్ వచ్చినా లారెన్స్ క్రేజ్ తో జెర్సీ సినిమాకి పోటీ ఇచ్చి మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మరి జెర్సీకి వచ్చిన టాక్ కి సినిమాకి పోటీ గనుక లేకపోతె ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చేవి. ఇక రెండో వారంలో కూడా జర్సీ భారీగా కొల్లగొడుతుందనే అనుకున్నారు.

రెండో వారం కూడా పోటీనే…

బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమా థియేటర్స్ దొరకక మే చివరి వారానికి వాయిదా పడింది. దీంతో జెర్సీకి రెండో వారంలో తెలుగు, తమిళం నుండి పోటీ లేకుండా పోయింది. నాని – గౌతమ్ లు హమ్మయ్య అనుకునేలోపు హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ది ఎండ్ గేమ్ గండం జెర్సీకి తగులుకుంది. ది ఎండ్ గేమ్ మీద అదేం క్రేజో గాని.. టికెట్స్ ఇలా ఓపెన్ అవుతున్నాయో లేదో అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరి జెర్సీ సినిమాని మొదటి వారం కాంచన 3, రెండో వారం ది ఎండ్ గేమ్ బాగా ఇరికించాయనే చెప్పాలి. లేదంటే మహర్షి సినిమా వచ్చే వరకు జెర్సీ సినెమాదే హవా అయ్యేది. కానీ కాంచన 3తో మొదటి వారం నష్టపోయిన జెర్సీ.. రెండో వారం ది ఎండ్ గేమ్ వలన నష్టపోవాల్సిన పరిస్థితి.

Tags:    

Similar News