జెర్సీ మొదటి రోజు ఎంత కొల్లగొట్టిందంటే..!

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా మళ్ళీరావా ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నిన్న‌ విడుదలైన జెర్సీ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి [more]

Update: 2019-04-20 08:23 GMT

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా మళ్ళీరావా ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నిన్న‌ విడుదలైన జెర్సీ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి షోకే జెర్సీ సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. నాని కెరీర్ లో జెర్సీ బిగ్గెస్ట్ రేటింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది. రివ్యూ రైటర్స్ కూడా జెర్సీ మూవీ బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తో సూపర్ హిట్ చేశారు. అయితే మొదటినుండి క్లాస్ మూవీగా జెర్సీ మీద ప్రచారం జరుగున్నప్పటికీ.. సినిమాలోని భావోద్వేగాలు, ఎమోషనల్ సీక్వెన్సెస్ బీ, సీ సెంటర్స్ ఆడియన్స్ ని కట్టిపడెయ్యడం ఖాయంగా కనబడుతుంది. అలాగే మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న జెర్సీ… ఈ శని, ఆదివారాల్లో బెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది అని టికెట్స్ బుకింగ్స్ చెబుతున్నాయి. అందులోనూ రాఘవ లారెన్స్ కాంచన 3 కి ఫ్లాప్ టాక్ రావడం కూడా జెర్సీకి కలిసొచ్చే అంశం. ఇక జెర్సీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి.

ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 2.44
సీడెడ్ 0.40
ఈస్ట్ గోదావరి 0.42
కృష్ణ 0.34
గుంటూరు 0.41
వెస్ట్ గోదావరి 0.29
నెల్లూరు 0.17
ఏపీ, టీఎస్ షేర్స్ 4.47 కోట్లు

Tags:    

Similar News