మహేష్ బాబు ఏడిపించేశాడు

సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా [more]

Update: 2019-04-25 08:29 GMT

సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచేసింది. ఆల్రెడీ 4 సాంగ్స్ బయటకు వచ్చాయి. మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకోనుంది. ఇక ఇందులో అల్లరి నరేష్, జయసుధ కీలక పాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో నటి జయసుధ.. మహేష్ నటన గురించి మాట్లాడారు. “విజయ నిర్మల గారికి నేను బంధువు కావడం వల్ల కృష్ణగారి కుటుంబసభ్యులతో నాకు మంచి అనుబంధం ఉంది. మహేష్ చిన్నప్పటి నుండి నేను అతడిని చూస్తున్నా. మహేశ్ బాబు ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. రెండు సీన్లలో ఆయన నటన చూస్తూ.. నా పాత్ర వైపు నుంచి ఇవ్వాల్సిన రియాక్షన్స్ ఇవ్వకుండా ఉండిపోయాను. మహేష్ తో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పించాడు. మహేష్ నటనకు అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చారు జయసుధ.

Tags:    

Similar News