రజిని కి సారీ చెప్పేశాడు

కాజల్ అగర్వాల్ – జయం రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘కోమాలి’ యొక్క ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి [more]

Update: 2019-08-06 08:03 GMT

కాజల్ అగర్వాల్ – జయం రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘కోమాలి’ యొక్క ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది కానీ ట్రైలర్ లో ఒక సీన్ కి రజిని ఫ్యాన్స్ తో పాటు కమల్ హాసన్ అభ్యంతరం తెలియజేసారు. కథ పరంగా ఇందులో హీరో జయం రవి కొన్నేళ్లు కోమాలో ఉండి చాలా సంవత్సరాల తర్వాత సాధారణ స్థితికి వస్తాడు. ఆయన కోమాలో కి వెళ్ళకముందు కోమాలో నుండి వచ్చిన తరువాత మార్పులు గురించి కాస్త హాస్యాన్ని జోడించి ఈ సినిమాను రూపొందించారు.

రజనీ ఫ్యాన్స్ కు….

అయితే ఇందులో రజినీకాంత్ అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించే అంశం ఏంటంటే…‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని రజనీకాంత్‌ ఇటీవల చెప్పిన వీడియోను జయం రవి చూస్తూ.. ‘‘ఇది లేటస్ట్‌ది కాదు; 1996ది. ఎవర్ని మోసగిస్తున్నారు?’’ అని ప్రశ్నిస్తాడు. దీని గురించి రచ్చ స్టార్ట్ అయింది. డైరెక్టర్ ని ఈ విషయం పై అక్కడ మీడియా వారు కూడా ప్రశించారు. కానీ అతను ” నేను కూడా రజిని అభిమానినే. ఆయన చిత్రాలకు కటౌట్లు కట్టి, పాలాభిషేకాలు కూడా చేశా. ఇది ఆయనపై ఉన్న గౌరవంతో, రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ఈ సీన్ తీశాం తప్ప వేరే ఉదేశం కాదు” అని చెప్పాడు.

కమల్ హాసన్ కూడా…..

ట్రైలర్ చూసి లేటెస్ట్ గా కమల్ కూడా స్పందించాడు. ‘దీన్ని నేను కామెడీగా చూడలేకపోతున్నా. కరెక్టు కాదు’ అంటూ దర్శకుడికి ఫోన్‌ చేసి చెప్పినట్లు సమాచారం. దింతో రజినీకాంత్ కు సంబందించిన సీన్ ను డిలీట్ చేస్తునట్టు నిర్మాత ఐసరి గణేశ్‌ ప్రకటించారు. తరువాత జయం రవి అండ్ నిర్మాత రజనీకి క్షమాపణ చెప్పారు.

Tags:    

Similar News