జయలలితగా ఎవరు కనిపిస్తారు..?

Update: 2018-08-17 12:19 GMT

తమిళనాడు మాజీ సీఎం జయలలితని అక్కడి వారంతా అమ్మగా కొలుస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమెపై బయోపిక్ తీయాలనుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ ఇందులో ఆమె పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

మహానటి అయితేనే మేలా..?

మరి ఆమె పాత్ర ఎవరు చేస్తారు అనుకుంటున్న టైంలో కోలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్ పేరులు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ మీడియాలో కీర్తి సురేష్..నయనతారల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా కీర్తి సురేష్ 'మహానటి' సినిమాలో సావిత్రిలా చేసి అందరి మనసులు దోచుకున్న సంగతి తెలిసిందే. ఈమె జయలలిత పాత్రకు కరెక్ట్ గా సూట్ అవుతుందనుకుంటున్నారు మేకర్స్.

రేసులో నయనతార కూడా...

తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తి గా ఎదిగిన జయలలిత జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే ఈ పాత్రకు నయనతార అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమె అయితే ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ పెరుతుందన్న ఆలోచనలో కూడా దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. మరి వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో తెలియాల్సిఉంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు.

Similar News