విజయ్ తో వన్ సైడ్ మాత్రమేనట

బాలీవుడ్ భామలంతా రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగిడే పనిలో ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవడ్ భామల మనసులను అలా [more]

Update: 2019-12-26 05:20 GMT

బాలీవుడ్ భామలంతా రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగిడే పనిలో ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవడ్ భామల మనసులను అలా అలా దోచేశాడు. అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీల కలల రౌడీగా విజయ్ స్టయిల్ బాలీవుడ్ కి పాకేసింది. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో మొదటిసారిగా తనకి విజయ్ దేవరకొండ ఆంటే ఇష్టమని చెప్పిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రౌడీ పక్కన ఫైటర్ లో ఆఫర్ అందుకుందనే న్యూస్ ఉంది. అయితే జాన్వీ – విజయ్ దేవరకొండ కాంబో అని ఎక్కడా అధికారిక ప్రకటన రాకపోయినా.. విజయ్ సరసన జాన్వీ కపూర్ అంటూ అందరూ ఫిక్స్ అయినా టైం లో మరోసారి విజయ్ దేవరకొండ తనకున్న క్రష్ ని బయటపెట్టింది.

మరోసారి చెప్పి….

తాజాగా నేహా దుపియా షోలో జాన్వీ కపూర్ విజయ్ మీదున్న ఇష్టం మరోసారి బయటపెట్టింది. అయితే తన ఇష్టం వన్ సైడ్ మాత్రమే అని.. నేను విజయ్ దేవరకొండ ఇష్టమని చెప్పినా… విజయ్ నుండి నో రియాక్షన్ అంటూ తెగ బాధపడుతుంది. నేనే విజయ్ అంటే ఇష్టమని ఎక్కువ ఫీలైపోయి మాట్లేడుస్తున్నా కానీ విజయ్ నుండి రియాక్షన్ లేదని చెబుతున్న జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ చాలా ఇష్టమని, ఆయన అంటే ఆరాధన అని, కానీ కేవలం ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది అంటూ విజయ్ దేవరకొండపై ఇష్టాన్ని జాన్వీ కపూర్ మరోసారి బయట పెట్టి… విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో మరింత పెంచేసింది ఈ చిన్నది.

Tags:    

Similar News