వావ్…పూరి భలే ప్లాన్ వేశాడుగా

ఇస్మార్ట్ శంకర్ తరువాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ తననెక్స్ట్ సినిమా ఏంటో అనౌన్స్ చేసేశాడు. సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పూరి ఓ సినిమా చేయడానికి [more]

Update: 2019-08-19 11:19 GMT

ఇస్మార్ట్ శంకర్ తరువాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ తననెక్స్ట్ సినిమా ఏంటో అనౌన్స్ చేసేశాడు. సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పూరి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కొన్ని రోజులు కిందటే ఈ కాంబినేషన్ లో మూవీ ని అనౌన్స్ చేసాడు పూరి. హీరో ఫైనల్ అయ్యాడు మరి హీరోయిన్?

జాన్విని హీరోయిన్ గా….

దీని కోసం పూరి మెగా ప్లాన్ వేసాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అందుకు సంబందించిన సంప్రదింపులు కూడా జరిపాడట పూరి. జాన్వికి కూడా తెలుగులో నటించాలనే కోరిక ఉంది. అయితే ఇది ఆమె కోరిక కాదు. తన తల్లి శ్రీదేవి కోరిక అంట. అందుకే ఈమె తెలుగు లో చేయాలని ఎప్పటినుంచో చూస్తుంది.

కాంబినేషన్ ఒక రేంజ్ లో…..

పైగా విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరో అంటూ గతంలో ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. సో స్క్రిప్ట్ నచ్చితే వెంటనే ఓకే చెప్పే అవకాశముంది. త్వరలోనే పూరి జగన్నాధ్ ముంబై వెళ్లి జాన్విని ఒప్పించే పని మొదలుపెడతారు. ఒకవేళ ఈమె ఓకే చెపితే మాత్రం సినిమా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. కానీ కాంబినేషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది.

Tags:    

Similar News