హాట్ ఫోజులో జాన్వీ కపూర్

Update: 2018-12-08 07:06 GMT

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'ధడక్' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో కరణ్ జోహార్ బ్యానర్ లో ఓ మల్టీ స్టారర్ లో తన రెండో సినిమా చేస్తుంది. సినిమాలతోనే కాదు గ్లామర్ తో కూడా యూత్ ని ఫిదా చేస్తుంది. ఫ్యాషన్ మ్యాగజైన్ల కోసం హాట్ హాట్ స్టిల్స్ ఇచ్చి అందరినీ ఆశర్యపరుస్తున్న జాన్వీ లేటెస్ట్ గా "లా ఆఫిషల్" అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇండియా డిసెంబర్ ఎడిషన్ కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఇక జాన్వీ సినిమాల విషయాలకి వస్తే కరణ్ జోహార్ స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న 'తఖ్త్'లో ఓ ఇంట్రెస్టింగ్ పాత్ర చేస్తుంది. ఆ మధ్య ఈమెను టాలీవుడ్ కి తీసుకుని రావడానికి చాలామంది డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ట్రై చేసారు కానీ వర్కవుట్ అవ్వలేదు. #RRR లో ఒక హీరోయిన్ గా అనుకుని ట్రై చేసారు కానీ ఒప్పుకోలేదని తెలుస్తుంది.

Similar News