జాన్వీ కపూర్ హాట్ స్టిల్.. మతిపోతుంది..!

Update: 2018-12-05 08:24 GMT

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈమధ్యే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్ కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. తొలి సినిమా 'దఢక్' వంద కోట్ల వసూళ్లు రాబట్టి కమర్షియల్ గానూ సంతృప్తి పరిచింది. ఈ సినిమా తరువాత జాన్వీ... కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో ఓ మల్టీ స్టారర్ లో కీలక పాత్ర చేస్తుంది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే గ్లామర్ పరంగా యూత్ ని తనవైపు అట్ట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ప్రముఖ పత్రిక ఎల్ ఆఫీసియల్ కోసం ఇచ్చిన హాట్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చాలా పద్దతిగా కనిపించే జాన్వీ కపూర్ లో ఈ కోణం కూడా ఉందా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగులోకి తీసుకురావాలని...

జాన్వీ కపూర్ ను తెలుగు లోకి తీసుకుని రావడానికి చాలా మంది దర్శనిర్మాతలు ట్రై చేస్తున్నారు కానీ వర్కవుట్ అవ్వలేదు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ లో ఈమెను తీసుకుందామని ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ట్రై చేసినా ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. దిల్ రాజు ఓ సినిమా కోసం సంప్రదించినా బోనీ కపూర్ సుముఖంగా లేకపోవడంతో డ్రాప్ అయినట్టు చెప్పుకున్నారు. రీసెంట్ గా #RRR లో జాన్వీ కపూర్ అనుకున్నారు కానీ ఇంకా కంఫర్మ్ కాలేదు. కానీ జాన్వీ కపూర్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుల మతి పోగొట్టేస్తుంది.

Similar News