’జనతా హోటల్’తో వస్తున్న హిట్ పెయిర్

Update: 2018-07-09 11:54 GMT

వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. 'ప్రేమిస్తే' నుంచి ''శoభో శంకర' మూవీ వరకు సురేష్ కొండేటి అందించిన చిత్రాలు ఈ కోవకే వస్తాయి. ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరు తెచ్చాయి. ఇప్పుడు సురేష్ కొండేటి 'జనతా హోటల్' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాల్లోకి వస్తే..'మహానటి' మూవీ తరువాత దుల్కర్ సల్మాన్ కు మంచి పేరు తెచ్చి పెట్టె గొప్ప చిత్రమిది.

మళ్లీ వస్తున్న హిట్ పెయిర్

'ఓకే బంగారం'తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో మంచి జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా రూపొందిన సూపర్ హిట్ మలయాళం చిత్రం ఉస్మాద్ హోటల్. ఈ చిత్రాన్ని 'జనతా హోటల్' పేరుతో తెలుగులోకి అనువదించారు సురేష్ కొండేటి. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు . ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్ ,

Similar News