జనగణమన బ్యాక్ డ్రాప్ అది కాదా!!

పూరి జగన్నాధ్ మహేష్ బాబు తో తెరకెక్కిద్దామనుకున్న జనగణమన మూవీ ని ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఓ బాలీవుడ్ హీరోతో తెరకెక్కించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసాడు. [more]

Update: 2020-06-26 07:48 GMT

పూరి జగన్నాధ్ మహేష్ బాబు తో తెరకెక్కిద్దామనుకున్న జనగణమన మూవీ ని ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఓ బాలీవుడ్ హీరోతో తెరకెక్కించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసాడు. జనగణమన స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవల్ అని చెప్పిన పూరి హీరో ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు. అయితే జనగణమన స్క్రిప్ట్ డెవెలెప్ చెయ్యి సినిమా చేద్దామని చెప్పిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. ఎవరో ఒక బాలీవడో స్టార్ ని ఈ సినిమా కోసం ఒప్పిస్తాడు. అయితే ఇప్పుడు జనగణమన బ్యాక్ డ్రాప్ మొత్తం దేశ భక్తితో కూడుకున్నదని.. మహేష్ ని హీరో గా అనుకున్నప్పుడు ఈ కథ ఆర్మీ నేపథ్యంలో ఓ వీర జవాన్ మీద రాసుకున్నాడట పూరి. కానీ తాజాగా పూరి స్క్రిప్ట్ ని మర్చేసాడట. కరణ జోహార్ సలహాతో జనగణమన స్క్రిప్ట్ చేంజ్ చేసాడనే టాక్ వినబడుతుంది.

అయితే తాజాగా పూరి కథ లో మిల‌ట‌రీ సెట‌ప్పే లేద‌ని…. భార‌తీయుల‌కు త‌మ బాధ్య‌త గుర్తు తెచ్చే సినిమా గా ఈ జనగణమన ఉండబోతుంది అని.. దేశాన్ని ప‌ట్టిపీడుస్తున్న అనేక స‌మ‌స్య‌లు మాత్రమే కాకుండా వాటికి ప‌రిష్కారాలూ తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఓ ర‌కంగా ఇది శంక‌ర్ భారతీయుడు, మురుగదాస్ తుపాకీ సినిమాలకు కాస్త అటు ఇటుగా దగ్గరగా ఉన్న కథగా చెబుతున్నారు. జనగణమన లో దేశభక్తిని టచ్ చేస్తూనే.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని కూడా పూరి కథలో కలిపేసాడట. మరి ఈ జనగణమన సినిమాని పూరి అనౌన్స్ చేసినప్పటినుండి… సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News