పింక్ రీమేక్ పై అందుకే అసంతృప్తి

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. జనసేనా ఏకైక ఎమ్యెల్యే రాజుగారు పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇవ్వడమే కాదు. పవన్ కళ్యాణ్ మొహం [more]

Update: 2019-12-14 04:51 GMT

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. జనసేనా ఏకైక ఎమ్యెల్యే రాజుగారు పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇవ్వడమే కాదు. పవన్ కళ్యాణ్ మొహం చూడనని చెప్పి జనసేనకు రాజీనామా చేసాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అధికారికంగా పవన్ కళ్యాణ్ లేకుండా పింక్ రీమేక్ దిల్ రాజు బ్యానర్ లో మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా అని నిన్నమొన్నటివరకు తెగ ఎదురు చూసిన అయన అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనా సోషల్ మీడియాలో హడావిడి చెయ్యకుండా కామ్ అయ్యారు.

కారణం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చెయ్యడం వారికీ బొత్తిగా నచ్చడం లేదు . పింక్ సినిమా హీరో ఎలివేషన్ కి అనువుగా లేని స్క్రిప్ట్ అది. పింక్ మూవీ పూర్తిగా సోషల్ కాన్సెప్ట్ కలిగిన కథ. అయితే దిల్ రాజు ఆధ్వర్యంలో వేణు శ్రీరామ్… పవన్ కోసం స్క్రిప్ట్ లో చాలా అంటే హీరోయిజం చూపించే విధంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ…. పవన్ ఇమేజ్ కి పింక్ రీమేక్ సరిపోదని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అసహనంగా వారు సోషల్ మీడియాలో సందడి చెయ్యకుండా కామ్ అయ్యారు. మరి పవన్ సినిమా మొదలైయింది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు హడవిడి చూడడానికి రెండు కళ్ళు చాలేవి కావు.

Tags:    

Similar News