పిక్ టాక్: శ్రీదేవిని మరిపిస్తున్నారు

Update: 2018-05-08 07:30 GMT

శ్రీదేవి బ్రతికున్నంత కాలం తన కూతుళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాదు.. తాను తన కూతుళ్లతో కలిసి పార్టీలకు, ఫంక్షన్స్ కి ఉత్సాహంగా వెళ్ళేది. అలాగే పెద్ద కూతుర్ని ఆచి తూచి వెండితెరకు పరిచయం చెయ్యబోయే లోపే దేవుడు ఆమెని కానరాని లోకాలకు తీసుకుపోయాడు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు ఎప్పుడూ తల్లితండ్రుల కనుసన్నల్లోనే ఉన్నారు. శ్రీదేవి ఎప్పుడు కూతుళ్ళ వెన్నంటే ఉండేది. వారికీ కావల్సిన నగలు, బట్టలు ఇలా ఏ విషయమైనా శ్రీదేవి దగ్గరుండి చూసుకునేది. ఇక శ్రీదేవి మరణాంతరం జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లను అర్జున్ కపూర్ దగ్గరనుండి అందరూ అంటే బోని కపూర్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా తమ ఫ్యామిలిలో కలుపుకోవడమే కాదు... వారితో చాలా ప్రేమగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఈ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సిస్టర్స్ ఇద్దరూ తమ కజిన్ సోనమ్ కపూర్ పెళ్లి లో హడావిడి చేస్తున్నారు. తన సవతి అక్కయ్య అన్షులా కపూర్, అన్న అర్జున్ కపూర్ లతో కలిసి ఖుషి, జాన్వీ లు సోనమ్ పెళ్లి వేడుకల్లో అదరగొట్టేస్తున్నారు. సంగీత్, మెహిందీ, పెళ్లి వేడుకల్లో ఈ సిస్టర్స్ ఇద్దరూ మంచి డ్రెస్సింగ్స్ తో అదరగొట్టే నగలతో అద్భుతమైన ఫోజులతో తన తల్లి లేని లోటుని తీర్చేస్తున్నారు. తండ్రి బోని కపూర్ తో కలిసి పెళ్లి వేడుకలకు హాజరవుతున్న ఈ సూపర్ సిస్టర్స్ మాత్రం హాట్ హాట్ డ్రెస్సులతో సోనమ్ పెళ్లి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక పెళ్ళికి ముందు సంగీత్, మెహిందీ పార్టీలలో వీరి హడావిడే అక్కడ ఎక్కువగా వుంది. మరి ఈ ఇద్దరి సిస్టర్స్ ని అలా చూస్తుంటే శ్రీదేవిని మరిపించేస్తున్నారు అన్నట్టుగా లేదు. మరి మీరు ఆ అందమైన సిస్టర్స్ ని చూసి తరించండి.

Similar News