ఏంటి రౌడీ కి ఓకె చెప్పిందా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భషాల్లో తెరకెక్కనున్న ఫైటర్ సినిమాలో [more]

Update: 2019-12-16 05:33 GMT

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భషాల్లో తెరకెక్కనున్న ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించబోయే హీరోయిన్ పై టాలీవుడ్ లో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ జరిగింది. పాన్ ఇండియా మూవీ అనుకోక ముందుండునుండి పూరి జగన్నాధ్.. విజయ్ దేవరకొండ కోసం శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ని తెచ్చే ప్రయత్నాలు చెయ్యడం మధ్యలో.. కియారా అద్వానీ పేరు వినబడడం జరిగింది. తాజాగా బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీకి రంగం సిద్దమయ్యాక, అలియా భట్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లలో ఎవరో ఒకరు రౌడీ హీరోయిన్ అంటూ కథనాలు ప్రచారంలోకొచ్చాయి.

అయితే తాజాగా జాన్వీ కపూర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి ఓకె చెప్పడమే కాదు… ఫైటర్ సినిమా కోసం సైన్ చేసిందనే న్యూస్ నడుస్తుంది. పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ కి కరణ్ జోహార్, జాన్వీ కపూర్ ని ఒప్పించడం హెల్ప్ చేసాడని, ఫైటర్ సినిమాకి బాలీవుడ్ లో కరణ జోహార్ నిర్మాతగా ఉండడం, జాన్వీ కపూర్ వెండి తెరకు ఎంట్రీ ఇచ్చే బాధ్యతలతో పాటుగా… ఆమె చేసే సినిమా ల విషయంలో కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కి గాడ్ ఫాదర్ లాంటోడు కాబట్టి.. విజయ్ దేవరకొండ తో జాన్వీ కపూర్ సినిమా చెయ్యడం సులభం అయ్యిందనే న్యూస్ వినబడుతుంది. మరి జాన్వీ కపూర్ గతంలోనే విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని కాఫీ విత్ కరణ్ షో లో చెప్పిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక జాన్వీ కపూర్ ఫైటర్ సినిమాకి సైన్ చేసిందని, జనవరి నుండి పూరి ఈ సినిమాని పట్టాలెక్కించి ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News