శ్రీదేవి కూతురు అలా లాకయ్యింది!!

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగడానికి నానా తంటాలు పడుతుంది. బుల్లి నిక్కర్లు, టైట్ జిమ్ డ్రెస్సులతో కత్తిలాంటి జాన్వీ [more]

Update: 2020-05-27 07:33 GMT

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగడానికి నానా తంటాలు పడుతుంది. బుల్లి నిక్కర్లు, టైట్ జిమ్ డ్రెస్సులతో కత్తిలాంటి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధఢక్ అనే చిన్న సినిమాలో నటించింది. శ్రీదేవి బ్రతికుంటే జాన్వీ కపూర్ క్రేజ్ మరింతగా బాలీవుడ్ లో పెరిగేది. అయితే జాన్వీ కపూర్ కి సౌత్ నుండి కూడా అవకాశాలొస్తుంటే… జాన్వీ మాత్రం బాలీవుడ్ లోనే తిరుగులేని హీరోయిన్ గా క్రేజీ సంపాదించాకే సౌత్ వైపు చూడాలనుకుని.. క్రేజీ ఆఫర్స్ వదిలేస్తుంది.

అయితే ధఢక్ తో కరణ్ జోహార్ జాన్విని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడమే కాకుండా జాన్వీ తదుపరి చిత్రాలను కరణ్ జోహార్ నిర్మించాడు. అవి కూడా లో బడ్జెట్ సినిమాలే. జాన్వీ కపూర్ ని చిన్నగా లాంచ్ చేసిన కరణ్.. తర్వాత కూడా చిన్న సినిమాలే చేయించాడు. అయితే తాజాగా జాన్వీ కపూర్ కి కష్టాలు మొదలయ్యాయని.. ఇంకా హీరోయిన్ గా క్రేజ్ రాకుండానే జాన్వీ కష్టాలు ఎదుర్కోబోతుంది అంటున్నారు. కారణం కరోనా లాక్ డౌన్ తో చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ ఓటిటిలో విడుదల చేస్తామని చెబుతున్నారు. తాజాగా జాన్వీ కపూర్ రెండు సినిమాలు థియేటర్స్ లోకి రావని.. ఓటిటిలోనే విదుడవుతాయని.. అంటున్నారు. అయితే జాన్వీ సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో విడుదలైతే క్రేజ్ పడిపోతుంది అని.. బోణి కపూర్ టెంక్షన్ పడుతున్నాడట. మరోపక్క కరణ్ కూడా జాన్వీ కపూర్ బాధ్యతలు తీసుకున్నాడు గనక జాన్వీ సినిమాలు థియేటర్స్ లోనే వచ్చేలా చూడాలని గట్టిగ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.

Tags:    

Similar News