ఎన్టీఆర్ కోసం శ్రీదేవి కూతురా?

ఎన్టీఆర్ RRR షూటింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎన్టీఆర్ ఇంటికే పరిమితమైనప్పటికీ… RRR టీజర్ పలు భషాల్లో విడుదలవడంతో.. ఎన్టీఆర్ ఆయా భాషలకి [more]

Update: 2020-03-30 05:41 GMT

ఎన్టీఆర్ RRR షూటింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎన్టీఆర్ ఇంటికే పరిమితమైనప్పటికీ… RRR టీజర్ పలు భషాల్లో విడుదలవడంతో.. ఎన్టీఆర్ ఆయా భాషలకి RRR టీజర్ కోసం వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. తన ఇంటి నుండి ఎన్టీఆర్ RRR టీజర్ కోసం డబ్బింగ్ చెబుతున్నాడు. ఇక RRR తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని ఓకె చేసాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంటినుండి నటీనటుల ఎంపిక ను కూడా త్రివిక్రమ్ పూర్తి చేయబోతున్నాడట.

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తన లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే నే అనుకుంటున్నాని అన్నారు. కానీ మధ్యలో రష్మిక పేరు వినబడింది. ప్రస్తుతం హిట్ హీరోయిన్ అయిన రష్మిక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో అనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా బాలీవుడ్ లో హాట్ అండ్ స్వీట్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు బయటికి వచ్చింది. గతంలోనే జాన్వీ కపూర్ పేరు ఎన్టీఆర్ సరసన RRR సినిమాలో వినబడింది. కానీ తాజాగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా లో జాన్వీ కపూర్ పేరు వినబడుతుంది. మరి విజయ్ దేవరకొండ సినిమాకి డేట్స్ ఖాళీ లేని జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ సినిమా కోసం డేట్స్ ఇస్తుందా అనేది సస్పెన్స్. పొలిటికల్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ వాడుకలో ఉంది.

Tags:    

Similar News