పుష్ప లో బాబు కూడానా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా సెట్స్ మీదకెప్పుడు వెల్దామా అని వెయిట్ చేస్తుంది. సుకుమార్ అన్ని ప్లానింగ్స్ [more]

Update: 2020-08-30 06:38 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా సెట్స్ మీదకెప్పుడు వెల్దామా అని వెయిట్ చేస్తుంది. సుకుమార్ అన్ని ప్లానింగ్స్ తో రెడీగా కూర్చున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ విషయంలో సుకుమర్ అల్లు అర్జున్ కలిసి చర్చలు ప్రారంభించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎప్పుడు ఎలా షూటింగ్ మొదలు పెడదామనే అంశంపై టీంతో కలిసి సుకుమార్, బన్నీలు చర్చిస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ లలో ఒకరిని ఐటెం సాంగ్ కోసం తీసుకుంటారని అంటుంటే.. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు పుష్ప లో ఓ కీలక పాత్ర చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది.

హీరోగా అవకాశాలు తగ్గాక విలన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన జగపతి బాబు విలన్ కెరీర్ మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. సై రా పాన్ ఇండియా మూవీలో ఓ కీ రోల్ చేసిన జగపతి బాబు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పాలోను ఓ కీలక పాత్ర చెయ్యబోతున్నాడంటున్నారు. మరి సుకుమర్ గతంలో రంగస్థలం నూ జగపతి బాబుతో మంచి విలన్ రోల్ చేయించాడు. ఇక పుష్ప లోను జగపతి బాబుకి ఓ మంచి నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ నే రాసుకున్నాడట. వారి జగపతి బాబు కేరెక్టర్ పుష్ప లో ఖాయమో కాదో…. ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అనే విషయంలో ఆయన అభిమానులు క్యూరియాసిటీతో ఉన్నారు.

Tags:    

Similar News