తమిళ స్టార్ హీరోతో జగపతిబాబు..!

Update: 2018-06-27 07:12 GMT

జగపతిబాబు క్యారెక్టర్ రోల్స్‌ చేయడం స్టార్ట్ చేశాక అతని జీవితం మారిపోయిందనే చెప్పాలి. గతంలో ఆయన హీరోగానే సినిమాలు చేసేవాడు కానీ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్‌ చేయడం వల్ల సౌత్ లోనే అత్యధిక డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా ఎదిగాడు. తెలుగులోనే కాకుండా తమిళం..మళయాళం లాంటి భాషల్లో సినిమాలు చేస్తూ సాగుతున్నాడు జగపతి. తెలుగులో జగపతిబాబుకి ఎంత గుర్తింపుందో అంతే తమిళంలో కూడా ఉంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ పక్కన విలన్ గా చేసాడు ఆయన. మళ్లీ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. సూర్య - విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఎన్జీకే’ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నెగటివ్ రోల్ అని తెలుస్తుంది.

సాయి పల్లవి కూడా...

సెల్వ సినిమాలంటే ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. చాలా టిపికల్‌గా ఉంటాయి అతడి సినిమాల్లోని పాత్రలు. హీరో సూర్య పాత్ర కూడా ఇందులో చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఇందులో రకుల్ ప్రీత్.. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి పల్లవి సూర్యతో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరనుంది.

Similar News