వివరణ ఓకె… ఆ సిట్యువేషన్ ఏంటి బాసు

గత నాలుగైదు రోజులనుండి మహేష్ బాబు – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి సీనియర్ నటుడు లేటెస్ట్ విలన్ అయిన జగపతి బాబు తప్పుకున్నాడనే [more]

Update: 2019-07-20 04:52 GMT

గత నాలుగైదు రోజులనుండి మహేష్ బాబు – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి సీనియర్ నటుడు లేటెస్ట్ విలన్ అయిన జగపతి బాబు తప్పుకున్నాడనే న్యూస్ మీద రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. అనిల్ కి జగపతి బాబుకి చెడడంతోనే ఈ సినిమా నుండి జగపతి బాబు తప్పుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా జగపతి బాబు సరిలేరు నీకెవ్వరూ నుండి తప్పుకోవడంపై అనిల్ రావిపూడి వివరణ ఇచ్చాడు. జగపతి బాబు గారు అనుకోకుండా ఈ సినిమా నుండి బయటికెళ్లారని.. ఆయనతో ఫ్యూచర్ లో సినిమా చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అన్నాడు.

తాజాగా జగపతి బాబు కూడా ఈ విషయమై ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి తప్పుకున్నప్పుడు.. ఆ విషయమై అనేక వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి… కాబట్టి ఇప్పుడు తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని.. తన 33 ఏళ్ళ కెరీర్ లో ఇలాంటి వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పిన జగపతి బాబు.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తన పాత్ర చాలా బావుందని.. ఇప్పటికీ ఆ పాత్ర చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిన జగ్గు భాయ్.. ఈ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకోవడం నిజమని చెప్పాడు. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి బయటికి రావడానికి కారణం.. ఓ సిట్యువేషన్ అని.. కొన్నిసార్లు సిట్యువేషన్స్ డిమాండ్స్ కి తలొగ్గాలని చెప్పిన జగపతి బాబు ఆ సిట్యువేషన్ ఏమిటో చెప్పకుండా దాటవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదో విషయం జరక్కపోతే ఇష్టమైన కేరెక్టర్ ని వదులుకుని ఎందుకు వచ్చేస్తాడు, దానైకోసమే రెండు సినిమాలు ఎందుకు వదులుకుంటాడు, జగ్గూభాయ్ ని అంతగా అతలాకుతలం చేసిన ఆ సిట్యువేషన్ ఏమిటో అనేది ఆ దేవుడికే తెలియాలి.

Tags:    

Similar News