జగపతి బాబు విలన్ గా కాకుండా..!

Update: 2018-08-16 06:24 GMT

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న జగపతి బాబు.. మధ్యలో బాగా బ్రేక్ తీసుకుని.. లెజెండ్ సినిమాతో విలన్ అవతారమెత్తాడు. లెజెండ్ సినిమాలో జగపతి బాబు విలన్ గా చేసిన నటనకు అందరూ పడిపోయారు. ఆ దెబ్బకి జగపతి బాబు విలన్ గా ఒక స్టేటస్ అనుభవిస్తున్నాడు. హీరో, హీరోయిన్స్ కి తండ్రి క్యారెక్టర్స్ లో, విలన్ క్యారెక్టర్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు టాలీవుడ్ నుండి భోజ్ పురికి కూడా వెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం విలన్ గా హవా కొనసాగిస్తున్న జగపతి బాబు ఇప్పుడు కొత్త అవతారంలోకి రాబోతున్నాడట.

తండ్రి బాటలో...

జగపతి బాబు హీరోగా టర్న్ తీసుకుని.. విలన్ అయినట్లు.. విలన్ గా నటిస్తూనే సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడట. ఎలాగూ జగపతి బాబు తండ్రి బి.వి రాజేంద్ర ప్రసాద్ గతంలో దర్శక నిర్మాతగా చక్రం తిప్పాడు. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాడు ఆయన. అయన నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న టైం లోనే జగపతి బాబు హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ.. జగపతి బాబు హీరోగా బ్రేక్ వచ్చినా నిర్మాణంపై దృష్టి మాత్రం సారించలేదు. కానీ ఇన్నాళ్లకు జగపతి బాబు నిర్మాత గా మారాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ముందు వెబ్ సిరీస్ లు...

మొదట్లో వెబ్ సీరీస్ లను నిర్మించి తర్వాత సినిమాల నిర్మాణంలో ఫోకస్ చెయ్యాలని జగపతి బాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గతంలో నిర్మాతగా ఇంట్రెస్ట్ చూపించని జగపతి బాబు ఇప్పుడు మాత్రం నిర్మాత కావాలనుకుంటున్నాడు. ఎలాగూ విలన్ గా ఎంత కాలం క్రేజ్ లో ఉంటామో చెప్పే పరిస్థితి లేదు. అందుకే జగపతి బాబు విలన్ నుండి నిర్మాతగా టర్న్ తీసుకోవానుకుంటున్నాడేమో.

Similar News