బయోపిక్ సినిమాగా కాదు...వెబ్ సిరీస్ గా..!

Update: 2018-08-26 11:33 GMT

కెరీర్ లో ముందుగా హీరోగా సక్సెస్ అయిన జగపతి బాబు కి భారీ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కెరీర్ కి టర్న్ఇంగ్ పాయింట్ అయ్యింది. జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారాడు. ప్రస్తుతం చిన్న పెద్ద 13 సినిమాలు వరకు జగపతి బాబు చేతిలో ఉన్నాయంటే ఆయన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ కి కూడా సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్ 3 తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఏ ఈలోపు జగపతి బాబు బయోపిక్ ని తెరకేకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జగపతి బాబు కెరీర్ లో.....

దర్శక నిర్మాత... రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ జగపతిబాబు కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డారు. అందుకే జగపతి బాబు జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను బయోపిక్ గా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. అయితే జగపతి బాబు బయోపిక్ ని వెండితెర మీద మూడు గంటల సినిమాలా కాకుండా ఒక వెబ్ సీరీస్ గా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట నిర్మతలు. ఒక వెబ్ సీరీస్ గాని లేదంటే..... సీరియల్ రూపంలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది కూడా దాదాపుగా 20 ఎపిసోడ్స్ తీసే ప్లాన్ లో ఉన్నారట.

సముద్రం టైటిల్ తో.....

మరి ఈ జగపతి బాబు బయోపిక్ ఇప్పటికే మొదలైనట్లుగా...ఆ వెబ్ సీరీస్ గా సముద్రం అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే జగపతి బాబు తన మీద బయో పిక్ ఉంటుందని చెప్పాడు కానీ.. దాన్ని ఎవరు తెరకెక్కిస్తున్నారు? అలాగే ఎవరు నిర్మిస్తున్నారు? ఆ బయోపిక్ లో నటించబోయే నటీనటులు ఎవరు? అనే విషయములు క్లారిటీ లేదు. అయితే ఈ విషయాలన్నీ త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారని సమాచారం.

Similar News