తండ్రిని విల‌న్ చేసేశార‌ట‌..!

శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌ తండ్రి పాత్ర చేసిన జగపతి బాబుకి ఎంత పేరు వచ్చిందో వేరే చెప్పనవసరం లేదు. తండ్రీకొడుకుల‌ మధ్య వచ్చే సీన్స్ కి ప్రేక్షకులు [more]

Update: 2019-04-20 06:01 GMT

శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌ తండ్రి పాత్ర చేసిన జగపతి బాబుకి ఎంత పేరు వచ్చిందో వేరే చెప్పనవసరం లేదు. తండ్రీకొడుకుల‌ మధ్య వచ్చే సీన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అలాంటి మంచి తండ్రీకొడుకుల్ని దర్శకుడు అనిల్ రావిపూడి భద్ర శతృవులుగా మార్చేసాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రోసారి విల‌న్ పాత్ర‌లో…

ఇందులో విలన్ పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నారు.సినిమాలో జగపతిబాబు నటనకు, ప్రతిభా ప్రదర్శనకు బోలెడు చోటు ఉండడంతో ఆయనను తీసుకుంటున్నట్లు టాక్. విలన్ పాత్రలలో జగపతి ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. అరవింద సమేత తరువాత మహేష్ బాబు సినిమాలో మరోసారి విలన్ పాత్ర చేయనున్నాడు జగ్గు భాయ్. త్వరలోనే పూర్తి డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News