పది లక్షల ఫైన్ నిజమే

జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ముక్కు అవినాష్ లాక్ డౌన్ కారణంగా అప్పుల పాలవడంతో జబర్దస్త్ షో చేస్తున్నప్పడు బిగ్ బాస్ కి ఆఫర్ [more]

Update: 2020-12-25 06:52 GMT

జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ముక్కు అవినాష్ లాక్ డౌన్ కారణంగా అప్పుల పాలవడంతో జబర్దస్త్ షో చేస్తున్నప్పడు బిగ్ బాస్ కి ఆఫర్ రావడంతో.. డబ్బు కోసమే బిగ్ బాస్ కి వెళదామని మల్లెమాల వాళ్ళని అడిగితే కాంట్రాక్టు ప్రకారం పది లక్షలు కట్టించుకున్నారని ప్రచారం జరగడం.. నాగబాబు ఒకొనొక సమయం లో మల్లెమాల వాళ్ళు పది లక్షల ఫైన్ వేస్తారంటూ మట్లాడడం చూస్తే అవినాష్ జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ కి రావడం వెనుక చాలానే జరిగింది అనేది అర్ధమైంది. అయితే అవినాష్ తాజాగా జబర్దస్త్ విషయంలో తనపై వస్తున్న న్యూస్ పై ఓపెన్ అయ్యాడు.

అసలు అవినాష్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడే పది లక్షలు ఫైన్ కట్టాడంటూ నాగబాబు బ్యాచ్ మాట్లాడింది. తాజాగా అవినాష్ అదే న్యూస్ ని కన్ఫర్మ్ చేసాడు. నేను అక్కడ ఎనిమిదేళ్లుగా పని చేస్తున్నా కూడా వాళ్ళు పది లక్షలు కట్టించుకున్నారు.. ఏ రెండు మూడు లక్షలో కడదామంటే కుదరదు పది కట్టాల్సిందే అంటే.. దానికి చమ్మక్ చంద్ర వంటి ఫ్రెడ్స్ సహాయం చేసారని.. ఆ పది లక్షలు కట్టే బిగ్ బాస్ లో అడుగుపెట్టా అంటున్నాడు అవినాష్. ఆ రకంగా అవినాష్ జబర్దస్త్ నుండి బయటికి వచ్చేలా చేసింది చంద్రా నే కదా. అయితే అది మల్లెమాల తప్పుకాదని.. ఇలా మరో కమెడియన్ చేయకూడదనే నా దగ్గర పది లక్షలు కట్టించుకున్నారంటూ మాట్లాడాడు. మరి అవినాష్ ఫైన్ కట్టిన బయట ప్రస్తుతం వెండితెర అవకాశాలతోను, ఓ కామెడీ షోకి హోస్ట్ గాను బాగానే గిట్టుబాటు అయ్యింది అంటున్నారు.

Tags:    

Similar News