నాగబాబు మొత్తుకున్నా వదలట్లేదు

నాగబాబు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంటే మల్లెమాల టివి నితిన్, భరత్ లనే కాదు.. నాగబాబు ని కూడా హైలెట్ అవ్వనిచ్చేలా కనిపించడం లేదు. నాగబాబు మొదటినుండి [more]

Update: 2020-01-03 04:57 GMT

నాగబాబు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంటే మల్లెమాల టివి నితిన్, భరత్ లనే కాదు.. నాగబాబు ని కూడా హైలెట్ అవ్వనిచ్చేలా కనిపించడం లేదు. నాగబాబు మొదటినుండి క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్లని మల్లెమాల ప్రోత్సహించదని చెబుతూనే ఉన్నాడు. వీడియోస్ రూపంలో గొంతు చించుకున్నాడు.. కానీ ఎలాంటి లాభం లేదు. నాగబాబు, నితిన్, భరత్ బయటికెళ్లి అదిరింది ప్రోగ్రాం చేసుకుంటున్నారు. అయితే నాగబాబు జబర్దస్త్ విషయాలను కెలికిన కెలుకుడికి మల్లెమాల నాగబాబు మీద పగబట్టింది. జబర్దస్త్ స్కిట్స్ లో అదిరింది ప్రోగ్రాం పై పంచ్ ల వర్షం కురిపిస్తుంది. మరోపక్క అదిరింది షో లోను జబర్దస్త్ పై పంచ్ లు పడుతున్నాయి. కాకపోతే ఓల్డ్ బ్యాచ్ ఓల్డ్ స్కిట్స్ తో అదిరింది ని హైలెట్ చేస్తున్నారు.

ఇక మల్లెమాల రివెంజ్ ఎలా ఉంది అంటే.. నాగబాబు జడ్జ్ గా చేస్తున్న అదిరింది ప్రోగ్రాం జీ తెలుగులో ప్రసారమైన టైం లో ఈటివి లో జబర్దస్త్ ఓల్డ్ క్రేజీ ఎపిసోడ్స్ ని ప్లే చేస్తుంది. జబర్దస్త్ లో నాగబాబు ఉన్నప్పుడు హిట్ అయిన స్కిట్స్ ని మల్లెమాల పనిగట్టుకుని అదిరింది షో టైం లోనే వెయ్యడం చూసిన నాగబాబు మల్లెమాలపై ఫైర్ అయ్యాడు. కానీ ఏం లాభం మళ్ళీ అదిరింది సెకండ్ ఎపిసోడ్ కి మల్లెమాల జబర్దస్త్ ని యాజిటీజ్ గా తీసుకొచ్చింది. మరి నాగబాబు మాటలను పట్టించుకోకుండా నాగబాబు మీద రివెంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంది మల్లెమాల. ఇక జబర్దస్త్ లో చూసిన స్కిట్స్ అయినా జబర్దస్త్ స్కిట్ అనగానే కొంతమంది ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోయారు. ఇక ఆ జబర్దస్త్ మొత్తం ఎపిసోడ్ లో యాడ్స్ లేకుండా ప్రసారం చెయ్యడంతో.. జబర్దస్త్ కి రేటింగ్ బాగానే వస్తుంది.

Tags:    

Similar News