అవినాష్ కి ఉన్న అండ చూస్తే షాకే?

జబర్దస్త్ లో ఆడుతూ పాడుతూ కామెడీ చేసి అందరిని నవ్వించే ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోను తన కామెడీ పంచ్ లతో బుల్లితెర [more]

Update: 2020-10-21 08:51 GMT

జబర్దస్త్ లో ఆడుతూ పాడుతూ కామెడీ చేసి అందరిని నవ్వించే ముక్కు అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోను తన కామెడీ పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. అక్కడి మిగతా కంటెస్టెంట్స్ తో మంచి వాడు అనిపించుకుంటూ.. నాగార్జున దగ్గర కామెడీగా మార్కులు కొట్టేస్తున్నాడు. తన కామెడీతో హౌస్ సభ్యులను తన చుట్టూ చేర్చుకున్న అవినాష్ మొదటిసారి ఎలిమినేషన్స్ లోకి వచ్చాడు. ఈ సోమవారం అవినాష్ కి సోహైల్ కి మధ్యన నామినేషన్ జరగగా అందులో అవినాష్ నామినేట్ అయ్యాడు. అయితే సాదా సీదాగా కనబడే అవినాష్ కి కామెడీ ఫాన్స్ చాలామంది ఉన్నారు. కానీ అవినాష్ మాత్రం ఈ నామినేషన్స్ విషయంలో కాస్త భయపడుతున్నాడు.

ఓపెన్ గానే మేము ఏమేమి అవదులుకుని బిగ్ బాస్ లోకి వచ్చామో తెలుసా? మాకు బయట చాలా పనులు ఉన్నాయి.. కానీ ఈ హౌస్ లోకి ఎందుకొచ్చామో తెలుసా అంటూ మాట్లాడుతున్నాడు. ఇక సోహైల్ కూడా తనకు ఓటు వేసే ప్రతి ఒక్కరిని అవినాష్ కి ఓట్ చెయ్యమని చెప్పాడు. అయితే ఇప్పుడు బయట అవినాష్ కి ఉన్న అండ చూస్తే నిజంగా షాకవ్వాలి. అవినాష్ ని ఎలిమినేట్ అవకుండా తప్పించడానికి జబర్దస్త్ సభ్యులు అంత కదులుతున్నారు. ఇప్పటికే రాకింగ్ రాకేష్ తన సోషల్ మీడియాలో అవినాష్ కి ఓట్స్ వేయాలంటూ ఉద్యమానికి తెర లేపాడు. జబర్దస్త్ టీం మొత్తంగా అవినాష్ వెనకనే ఉందని అర్ధమవుతుంది. మరి అభిజిత్, మోనాల్, అరియనా, నోయెల్ కి ఒక వర్గం ఫాన్స్ మాత్రమే ఉన్నారు. కాని అవినాష్ కి జబర్దస్త్ టీం మొత్తం ఉండడమే కాదు.. జబరదాస్ ప్రేక్షకులు కూడా అవినాష్ ని సేవ్ చెయ్యడం పక్కాగా కనబడుతుంది వ్యవహారం.

Tags:    

Similar News