నీకు హీరో పిచ్చెమిటి బాబూ

కమెడియన్స్ చాలామంది హీరోలుగా మారి సక్సెస్ అయిన వారున్నారు, ప్లాప్ అయినా వారున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు అంటూ కొంతమంది కమెడియన్స్ కామ్ గా తమ [more]

Update: 2019-12-29 15:18 GMT

కమెడియన్స్ చాలామంది హీరోలుగా మారి సక్సెస్ అయిన వారున్నారు, ప్లాప్ అయినా వారున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు అంటూ కొంతమంది కమెడియన్స్ కామ్ గా తమ పని తాము చేసుకుంటున్నారు. జబర్దస్త్ తో ఎనలేని పాపులారిటీ సంపాదించిన సుడిగాలి సుధీర్… యాంకర్ రష్మీ తో సం థింగ్ సం థింగ్ అనే విషయంలో ఇంకా హైలెట్ అయ్యాడు. ఇక ఢీ ప్రోగ్రాం… ఇలా సుధీర్ పాపులారి ఓ రేంజ్ లో పెరిగిపోయి.. నిర్మాతలు సుధీర్ ని హీరో ని కూడా చేసేసారు. తాజాగా సాఫ్ట్ వెర్ సుధీర్ తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ 3 మంకీస్ అంటూ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులను ఏసుకుని వచ్చేస్తున్నాడు. మరి సుడిగాలి సుధీర్ క్రేజ్ ని నిర్మాతలు వాడుకుందామని సినిమా తీస్తే… కమెడియన్ వి కమెడియన్ గా ఉండక.. నీకు హీరో వేషాలెందుకు అంటూ ప్రేక్షకులు సుడిగాలి సుధీర్ సినిమాని తిప్పి కొట్టారు.

నిన్న విడుదలైన సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమా చెత్త కాదు పరమ బోరింగ్ సినిమా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే తెరపై సుధీర్ తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డాన్స్ లలో సుధీర్ మాస్ హీరో రేంజ్ లో ఇరగదీశాడు. ఇక కామెడీ పరంగా కుడా సుధీర్ సైడ్ నుండి ఓకె. కానీ సినిమా సెకండ్ హాఫ్ తరువాత కొంచెం ట్రాక్ తప్పుతుంది.దీనితో ఆడియన్స్ కథనుండి డైవర్ట్ అయిపోతారు. సుడిగాలి సుధీర్ మూవీ అంటే మంచి కామెడీ ఉంటుందని అనుకుంటే.. ఈ సినిమాలో అది తప్ప అంతా ఉంది అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చెత్త, నేపధ్య సంగీతం బోర్, ఎడిటింగ్ వరెస్ట్ అన్న రేంజ్ లో సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమా ఉందంటున్నారు. మరి ఈ సినిమా ఇలా ఉంటె.. 3 మంకీస్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News